- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అకాల వర్షం.. రైతుల కన్నీటి గోస
by Shyam |
X
దిశ, జనగామ: ఆకాల వర్షంతో జిల్లాలోని పలు మార్కేట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయింది. గురువారం తెల్లవారు జామున పడిన అకాల వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏకంగా వర్షపు నీటిలో ధాన్యం కోట్టుకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5వ తేదిన తెచ్చిన ధాన్యం నేటికి కొనుగోలు చేయకపోవడంతో రైతులు, మార్కేట్ యార్డులో ఉంటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురువారం పడిన వర్షానికి ధాన్యం నెలపాలయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు మార్కేట్ యార్డులో సరిపడ వాన కవర్లు అందించాలని సూచించారు. ఇదిలా ఉండగా పలువురు ప్రతిపక్షనేతలు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story