- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తినలో అడుగుపెట్టిన రైతన్నలు
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రైతన్నలు ఢిల్లీలో అడుగుపెట్టడానికి అనుమతి సాధించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా హస్తినలో అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్న రైతులను పోలీసులు సరిహద్దులోనే అడ్డుకున్నారు. అత్యవసర సరుకులు, ఆహారాన్ని వెంటబెట్టుకుని తమ నిరసన గళాన్ని ఢిల్లీలో వినిపించడానికి రైతన్నలు బయల్దేరారు. కానీ, హర్యానా, ఢిల్లీ సరిహద్దులో ఢిల్లీ పోలీసులు బారికేడ్లు, ఇసుక నింపిన వాహనాలను రోడ్డుకు అడ్డుపెట్టి రైతన్నలను నిలువరించే యత్నం చేశారు. లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అయినప్పటికీ జడవకుండా నిరసన చేపట్టిన రైతులు ఢిల్లీలోకి అనుమతినివ్వాలని ప్రధానికి లేఖ రాశారు. ఎట్టిపరిస్థితుల్లో అన్నదాతలను ఢిల్లీలోకి ప్రవేశించమని కంకణం కట్టుకున్న పోలీసులు చివరికి వారిని అనుమతించారు. ఇప్పటికే 5 వేల మంది రైతులు హస్తినకు చేరుకున్నట్టు తెలుస్తోంది. రైతులు నేరుగా కేంద్రంతో చర్చలు జరపాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ సహా కేంద్రమంత్రులు విజ్ఞప్తి చేశారు. కానీ, చర్చలకు వచ్చే నెల 3వ తేదీ వరకు ఎందుకు వేచి చూడాలని పంజాబ్ సీఎం ప్రశ్నించారు.