వందేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నం..

by Shyam |
వందేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నం..
X

దిశ, నల్లగొండ: తమ భూములను అటవీశాఖ అధికారులు ఆక్రమిస్తే సహించేది లేదని, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. వందేళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న మా భూముల చుట్టూ అటవీ అధికారులు కంచే వేస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో తమ భూమిలోకి పోలేని పరిస్థితి నెలకొందని దాని వల్ల తాము ఉపాధిని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు. సర్వే నిర్వహించడానికి వచ్చిన అధికారులను అడ్డుకుని తమ సమస్య పరిష్కారం అయిన తర్వాతే పనులు చేపట్టాలని తెలిపారు. తమ భూములకు పట్టా పుస్తకాలు ఉన్నాయని.. తమకు రైతు బంధు పథకం డబ్బులు కూడా వస్తున్నాయని వారు తెలిపారు. అటువంటి భూముల్లో అక్రమంగా కంచె వేయడం అధికారులకు సబబు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తుర్కపల్లి తహసీల్దారుని కలవగా ఆయన అటవీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు.

Advertisement

Next Story

Most Viewed