- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4న చర్చలు విఫలమైతే కఠిన నిర్ణయాలు : రైతు సంఘాలు
న్యూఢిల్లీ : ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం తమతో జరిపే చర్చలు విఫలమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు హెచ్చరించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కేవలం ఐదుశాతం సమస్యలు మాత్రమే లేవనెత్తామని, ఇప్పటివరకు వాటిపైనే చర్చ జరిగిందని తెలిపారు. రైతు సంఘాల నేతలు శుక్రవారం సింఘు సరిహద్దులో విలేకరులతో మాట్లాడుతూ, నూతన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీని ప్రభుత్వం ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. హర్యానాలో షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులను బంద్ చేయడానికి తేదీలు ప్రకటిస్తామని రైతు నేత వికాస్ తెలిపారు.
రాజస్తాన్, హర్యానా సరిహద్దులోని షాజహాన్‌పుర్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులూ ఢిల్లీవైపు కదలివస్తారని స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ అన్నారు. 4న జరిగే ఏడో దఫా చర్చల్లో తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే 6వ తేదీన ట్రాక్టర్ మార్చ్ చేపడతామని మరో నేత యుద్వీర్ సింగ్ హెచ్చరించారు. సుమారు మూడు వారాల తర్వాత రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆరో దఫా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రైతులు ఎజెండాలో చేర్చిన మొత్తం నాలుగు డిమాండ్లలో రెండింటిపై ఉభయులకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ, రైతుల కీలక డిమాండ్లు చట్టాల రద్దు, కనీస మద్దతకు ధరకు సంబంధించిన అంశాలపై చర్చను 4వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.