తడిసిన ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతులు

by Aamani |
తడిసిన ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతులు
X

దిశ, ఆదిలాబాద్: గత 15 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఖానాపూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. అకాల వర్షాల కారణంగా మక్కలు, వడ్లు తడిసిపోతున్నాయని, వాటిని కొనేందుకు కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క మంత్రులు, శాసనసభ్యులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ, ఇక్కడి అధికారులు మాత్రం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. సాయంత్రం 4 గంటల నుంచి చీకటి పడేదాకా రైతులు రోడ్డుపై బైఠాయించారు. సంబంధిత అధికారులు వచ్చేదాకా ఆందోళన విరమించేది లేదని పేర్కొనడంతో రెవెన్యూ అధికారులు వచ్చి రైతులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed