బాలీవుడ్ జెర్సీపై రైతుల ఆందోళన ఎఫెక్ట్

by Shyam |
బాలీవుడ్ జెర్సీపై రైతుల ఆందోళన ఎఫెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘జెర్సీ’. నాని తెలుగు మూవీ జెర్సీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు మరోసారి బ్రేక్ పడింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అండ్ టీమ్ గత కొద్ది రోజులుగా చండీగఢ్‌లో షూటింగ్ చేస్తున్నారు. కానీ ఈ ఏరియాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం కావడంతో చిత్రీకరణ వాయిదా వేసిన డైరెక్టర్.. షూటింగ్ స్పాట్‌ను డెహ్రాడూన్‌కు మార్చేశారని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్‌లో షాహిద్, మృణాల్‌పై మేజర్ పోర్షన్స్ చిత్రీకరించాక, చండీగఢ్‌లో బ్యాలెన్స్ ఉన్న మూడు రోజుల షూటింగ్ కంప్లీట్ చేస్తారని సమాచారం. అమన్ గిల్, అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా జెర్సీని నిర్మిస్తుండగా.. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే చాన్స్ ఉంది.

Advertisement

Next Story