- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపం.. ఈ రైతుల బాధ చూస్తే కంటనీరు తప్పదు (వీడియో)
దిశ, జనగామ: జనగామలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌లో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. మార్కెట్‌లో అధికారులు రైతులకు కావాల్సినన్నీ టార్ఫాలిన్లు సమకూర్చకపోవడంతో వందలాది మంది రైతుల వేలాది క్వింటాళ్ల ధాన్యం వర్షార్పణమైంది. కళ్లముందే ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోతుంటే కాపాడుకునేందుకు రైతుల పడిన కష్టం వర్ణణాతీతం. కొంతమంది రైతులయితే వర్షంలోనే రోదిస్తూ ధాన్యం కాపాడుకునే ప్రయత్నం చేశారు.
అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. అప్పులు చేసి వ్యవసాయం చేస్తే కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు తీర్చలేని ప్రభుత్వం ఉండి ఎందుకు..? లేకెందుకు..?, రైతులు నాశనమవుతుంటే చూసినోడు ఎవ్వడూ బాగుపడడు అంటూ శాపనార్థాలు పెట్టారు. అంతేగాకుండా.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాలు ఆలస్యంగా జరుగుతున్నాయని సోమవారం మార్కెట్‌కు వచ్చిన రైతులు చైర్‌పర్సన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మెలకెత్తిన వరి ధాన్యాన్ని అధికారులకు, మీడియాకు చూపి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పినా, అధికారులు కొంచెం కూడా బాధ్యతతో వ్యవహరించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.