- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డెక్కిన రైతులు.. పురుగుల మందుతో నిరసన
X
దిశ, మహబూబాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఖరీదు చేసిన ధాన్యం ను తరలిచకపోవడంతో ఆగ్రహించిన రైతులు కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మాహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 2వేల బస్తాల ధాన్యంను దన్నసరి సింగిల్ విండో సొసైటీ ద్వారా కొనుగోలు చేశారు.
వారం రోజుల గడిచినప్పటికి ఆ ధాన్యంను తరలించకపోవడంతో బుధవారం కురిసిన అకాల వర్షంకు తడిసిపోయాయి. కాగా గురువారం రైతులు కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. కేసముద్రం, గూడూరు ప్రధాన రహదారి పై ధాన్యం బస్తాలను వేసి రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నామని వాపోయారు. తడిసిన ధాన్యంను మద్దతు ధర కేటాయించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story