నెమలికి జ్వరమొచ్చింది.. ఆ రైతు ఏం చేశాడంటే..?

by Shyam |
నెమలికి జ్వరమొచ్చింది.. ఆ రైతు ఏం చేశాడంటే..?
X

దిశ, జగదేవపూర్ : ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు వంటేరు సురేందర్ రెడ్డి వ్యవసాయ పోలం వద్ద ఆదివారం ఉదయం నెమలి అస్వస్థతకు గురై నడవలేని స్థితిలో కనిపించింది. అది గమనించిన రైతు సురేందర్ రెడ్డి వెంటనే అటవీ శాఖ అధికారి నిజాముద్దీన్‌కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫారెస్టు అధికారి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. చికిత్స అందించిన అనంతరం అడవిలో నెమలిని వదలనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story