ట్రాక్టర్ కింద పడి రైతు మృతి

by Sumithra |
ట్రాక్టర్ కింద పడి రైతు మృతి
X

దిశ, డోర్నకల్ : ట్రాక్టర్ కింద పడి రైతు మృతి చెందాడు.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పరిధిలోని మంచ్య తండాకు చెందిన మల్సూర్ తన పొలంలో పండిన సన్న ధాన్యాన్ని అమ్ముకోడానికి అయ్యగారిపల్లి గ్రామానికి తీసుకెళ్లాడు.

ఆ సమయంలో ట్రాక్టర్లు భారీగా తరలి రావడంతో లైన్లో ఉన్న ఓ ట్రాక్టర్ కింద రైతులు సేద తీరారు. అందులో కొంతమంది రైతులు లేచి వెళ్లగా మల్సూర్ అనే రైతు అలానే ఉండిపోయాడు. డ్రైవర్ చూసుకోకుండానే ట్రాక్టర్ స్టాట్ చేసి తీయడంతో వాహనం టైర్లు రైతు మీద నుంచి వెళ్లాయి. దీంతో తీవ్రగాయాల పాలైన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story