- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఏ పంట పండించాలో రైతులకే వదిలేయాలి’
దిశ, నల్లగొండ: ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు డబ్బులు చెల్లిస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతుల స్వేచ్చను హరించడం కేసీఆర్‌కు తగదని రైతు సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం పంటలు వేయాలో రైతులకే వదిలేయాలని, రైతులను ఆదేశించడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి, ఏ పంట అయితే దిగుబడి బాగా వస్తుందో ఆ పంటలు మాత్రమే వేసుకుని లాభపడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని, రైతులను గందరగోళ పరిస్థితిలో నెట్టివేయడం మంచిది కాదన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పిన పంటలు మాత్రమే వేయాలని రైతులను ఆదేశించడం లేదని ఆయన విమర్శించారు. రైతుల పట్ల వ్యతిరేకత చూపించిన ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకూ ముందుకు సాగలేదన్నారు. ఖరీఫ్ సీజన్ సమీపించడంతో రైతులకు పూర్తిగా సబ్సిడీపై నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు.