వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు.. ఆత్మహత్యకు యత్నం

by Sridhar Babu |
వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు.. ఆత్మహత్యకు యత్నం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గంట సతీష్ కు చెందిన 30 గుంటల స్థలం పట్టదారుపేరు మార్చారని ఆరోపించాడు. తనపేరిట ఉండాల్సిన భూమి వేరేవారి పేరిట మారిందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అసహనానికి గురైన సతీష్ పెట్రోల్ బాటిల్ తో వాటర్ ట్యాంక్ ఎక్కాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మార్వో సునిత ఘటనా స్థలానికి చేరుకుని బాధితునితో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని హమీ ఇవ్వడంతో ఆయన కిందకు దిగాడు. రెండేళ్లుగా అధికారులు తనను ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప పట్టాదారు పేరును మాత్రం మార్చడం లేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం రాజిరెడ్డి అనే రైతుకు చెందిన భూమి పట్టాదారు తండ్రి పేరు తప్పు పడిందని చెప్పినా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఎదులాపురం గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు కూడా రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed