సుశాంత్‌కు అభిమాని ఘన నివాళి..

by Jakkula Samataha |
sushanth
X

– చుక్కల్లో చుక్కలా ఒదిగిన బాలీవుడ్ స్టార్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత.. అభిమానులు, తోటి నటీనటులు చాలా బాధపడిపోయారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆవేదన చెందారు. నెపోటిజం వల్లే చనిపోయాడని.. బాలీవుడ్‌ను గుప్పిట్లో ఉంచుకున్నట్లు భావిస్తున్న ఫిల్మ్ మేకర్స్‌ పై మండిపడ్డారు. సుశాంత్ లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని.. ఫ్రెండ్స్, సెలబ్రిటీస్, ఫ్యాన్స్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి నివాళులు అర్పించారు. అయితే ఒక అభిమాని మాత్రం అందరి కంటే భిన్నంగా సుశాంత్‌కు నివాళులు అర్పించారు.

గెలాక్సీ, స్టార్స్‌పై చాలా ఇంట్రెస్ట్ చూపించే నిజమైన స్టార్ అయిన సుశాంత్ పేరును ఒక స్టార్ పేరున రిజిస్టర్ చేయించాడు. ‘సుశాంత్ నక్షత్రాలను చాలా ఇష్టపడ్డాడు. అందుకే అతని పేరును ఆ నక్షత్రానికి పెట్టడం సముచితం అనిపించింది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ విధంగా సుశాంత్ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడని తెలిపాడు.

సుశాంత్ విలువ తెలుసుకోవడంలో చాలా ఆలస్యం అయిందని.. కానీ తను నా జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడని తెలిపింది. అతను ఒక సంపూర్ణ రత్నమని.. ఈ చీకటి ప్రపంచంలో స్వచ్చమైన, విలువైన వ్యక్తి అని తెలిపింది. టెలీస్కోప్ ద్వారే నక్షత్రాన్ని గుర్తించడం ఆనందంగా ఉందని చెప్పింది.

Advertisement

Next Story