- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంకో జన్మంటూ ఉంటే మిమ్మల్ని ఎప్పటికీ వదలను.. షాకింగ్ సూసైడ్ నోట్..!
దిశ, జడ్చర్ల : ఇంకో జన్మంటూ ఉంటే నన్ను బాధపెట్టిన వారిని ఎప్పటికీ వదలను అంటూ.. సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలంలో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఆనంద్ (25)తన భార్య పిల్లలతో కలిసి మిడ్జిల్ మండలం దొనూర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. మృతుడు ఆటోలో ఊర్లు తిరుగుతూ హారెల్ మాల్ అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.అయితే, ఏం జరిగిందో తెలీదు కానీ తన భార్య పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు సూసైడ్ నోట్ రాయగా అందులో ఇలా ఉంది.. నాకు భూమి మీద ఇంకో లోకం ఉందో లేదో తెలియదు. కానీ, ఉంటే మాత్రం నా మనసుని బాధ పెట్టిన వారిని క్షమించను, ఇంతకు ముందే ఇంట్లో గడియ పెట్టుకోవాలి అనుకున్నా.. నీతో మాట్లాడాక నాకు ధైర్యం వచ్చింది. నిన్ను బయటకు పంపించడానికి నాకు ఇంకో దారి లేదు. సారీ సిరి(శిరీష).. నన్ను క్షమించు.. అభి, వరుణ్, మీ నాన్నను క్షమించండి రా.. అంటూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భార్య తన పిల్లలతో కలిసి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆనంద్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో భార్య బోరున విలపించింది. తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరవుతున్న దృశ్యం చుట్టుపక్కల వారిని కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.కాగా, ఆనంద్‌కు ఎవరితో గొడవలు లేవని, అతని మనసును ఎవరు గాయపరిచారో, అలా నోట్ ఎందుకు రాశారో కూడా తెలీదని మృతుడి భార్య శిరీష చెప్పినట్టు తెలుస్తోంది.