షాద్‌నగర్‌లో రూ.4లక్షల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

by Sumithra |
షాద్‌నగర్‌లో రూ.4లక్షల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
X

దిశ, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రతన్ కాలనీలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు సైబరాబాద్ ఎస్ఓటి ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఎస్సై రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం దాడులు జరిపారు. షాద్‌నగర్‌కు చెందిన పిప్పళ్ళ శ్రీనివాస్ యాదవ్, షాబాద్ మండలం సీతారాంపురంనకు చెందిన కుందాల సిద్దేశ్వర్‌లను అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ. 4లక్షల విలువైన మొత్తం 399 నకిలీ పత్తి విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 300 ప్యాకెట్లు బిల్లా 999 బిజీ 2 కాటన్ సీడ్స్ ఉండగా, 99 ప్యాకెట్లు భీష్మ బి కె హెచ్ హెచ్ 2002 జీకే కాటన్ సీడ్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.వీరు షాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి, జడ్చర్ల మండలం ఆదిరాల గ్రామానికి చెందిన జగన్ రెడ్డి, సీతా రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, బూత్పూర్ గ్రామానికి చెందిన గోపికృష్ణ సీడ్స్ యజమానికి ఈ నకిలీ విత్తనాల విక్రయాల్లో సంబంధం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 800 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని షాద్ నగర్ పీఎస్‌లో ఎస్వోటీ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story