పోలీస్ కమిషనర్‌కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు 

by Sridhar Babu |
పోలీస్ కమిషనర్‌కు షాక్ ఇచ్చిన కేటుగాళ్లు 
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్న ఘనులు సామాన్యులనే కాదు పోలీసు అధికారులను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా రామగుండం పోలీసు కమిషనర్ పేరిట ఫేక్ అకౌట్ క్రియేట్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఈ అకౌంట్ వివరాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సైబర్ నేరగాళ్లు సీపీ పేరిట క్రియేట్ చేసిన అకౌంట్ ద్వారా డబ్బులు తమ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేయాలని అడుగుతున్నారు. ‘వి.సత్యనారాయణ ఐపీఎస్’ పేరిట క్రిమినల్స్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేశారని గుర్తించిన పోలీసులు పూర్తి వివరాలను సేకరించారు. డబ్బులు పంపాలని అగంతకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ 7409377582 ఆధారంగా వివరాలు సేకరించారు. ఈ నెంబర్ మిథిలేష్, నవీన్, ఇంటి నెంబర్ 35 దేవగంజ్, మెయిన్ పూరి యూపీ వెస్ట్ ఉన్న అడ్రస్‌గా గుర్తించారు.

రూ. 15 వేలే..

ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 15 వేల నుండి 20 వేల వరకు గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపించాలని కోరుతున్నారు. ఫేస్ బుక్ మెసేంజర్ ద్వారా ఫ్రెండ్స్‌కు మెసేజ్‌లు పంపించి ఈ రకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌కు సంబంధించిన వ్యవహారంపై సీపీ సత్యనారాయణ పరిశోధన చేయాలని సైబర్ క్రైమ్ వింగ్‌ను ఆదేశించారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

వారిని నమ్మకండి : సీపీ

ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా డబ్బులు ఇవ్వాలని అడుగుతున్న ముఠాల మాటలు నమ్మవద్దని సీపీ సత్యనారాయణ తెలిపారు. అధికారి పేరిట డబ్బులు అడిగితే ప్రతి ఒక్కరూ పంపుతారన్న ఆశతో సైబర్ క్రిమినల్స్ ఆశిస్తున్నారని అన్నారు.

Advertisement

Next Story