- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష మంది మహిళలకు డిజిటల్ విద్య… ఫేస్‌బుక్ ప్రోత్సాహం
వియ్ థింక్ డిజిటల్ అనే ప్రోగ్రామ్ పేరుతో భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు చెందిన లక్ష మంది మహిళలకు డిజిటల్ విద్య అందించనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రకటించింది. జాతీయ మహిళా కమిషన్, సైబర్ పీస్ ఫౌండేషన్ వారి సహకారంతో సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో మొదలు పెట్టి అస్సాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు దీన్ని విస్తరించనున్నారు.
2019లో రెండో దక్షిణాసియా రక్షణ సదస్సులో ఫేస్‌బుక్ ఈ వియ్ థింక్ డిజిటల్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించింది. ఇందులో పౌరసత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ, తప్పుడు సమాచారం గురించిన అంశాలను బోధిస్తారు. ఇంటర్నెట్ ద్వారా లభ్యమయ్యే విద్య, సోషల్ అనుసంధానం, ఆర్థిక అవకాశాలు వంటివి మహిళలకు కూడా దక్కాలనే ఉద్దేశంతో ఫేస్‌బుక్ ఈ ప్రోగ్రామ్‌ని రూపొందించినట్లు ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖీ దాస్ చెప్పారు.