- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్మ సంరక్షణకు చక్కటి ఆయిల్స్
దిశ, వెబ్‌డెస్క్ : చర్మతత్వం అందరిదీ ఓకేలా ఉండదు. కొందరిది జిడ్డు చర్మం అయితే, మరికొందరికి పొడి చర్మం ఉంటుంది. ఏ రకమైన చర్మమైనా.. ఫేస్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చర్మసౌందర్యానికి మేలు కలుగుతుంది. కొంతమంది ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ సమస్య మరింత పెరుగుతుందని, ఆక్నే బ్రేకవుట్స్ పెరుగుతాయని భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. వాస్తవానికి ఫేస్ ఆయిల్స్ స్కిన్ టెక్చర్‌ను బ్యాలెన్స్ చేయడానికి దోహదపడతాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్స్, ఇంప్యూరిటీస్ నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. పర్‌ఫెక్ట్ స్కిన్ కోసం.. కెమికల్స్‌తో కూడిన బ్యూటీ క్రీమ్స్ వాడే బదులు.. ఫేస్ ఆయిల్స్ వాడటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
టీ ట్రీ ఆయిల్
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఈ నూనెను ఫేస్‌కు అప్లై చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్, రెడ్‌నెస్‌ల నుంచి చర్మాన్ని సంరక్షిండంతో పాటు యాక్నే సమస్యను అవాయిడ్ చేయడంలోనూ ఈ ఆయిల్ ది బెస్ట్‌గా పనిచేస్తుంది. ముఖంపై ఏర్పడిన చిన్న చిన్న గాయాలను నయం చేయడంలోనూ ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది.
జోజోబా ఆయిల్
ఇందులో ‘విటమిన్- ఈ’ పుష్కలంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడంలో.. ఈ విటమిన్ పాత్ర కీలకం. అందుకే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ‘విటమిన్-ఈ’ని వాడతారు. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచేందుకు సాయపడతాయి. అందుకే జోజోబా ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల.. స్కిన్ తేమను కోల్పోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ‘యాక్నే ఫ్రీ’ గానూ ఉంటుంది.
గ్రేప్ సీడ్ ఆయిల్
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కలిగిన ఈ నూనెను ఫేస్‌కు అప్లై చేయడం వల్ల.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. స్మూత్ అండ్ సాఫ్ట్‌గా తయారవుతుంది. ఈ ఆయిల్‌లో విటమిన్ ఈ, సీ లు అధికంగా ఉంటాయి. సూర్య రశ్మి వల్ల కమిలిపోయిన చర్మానికి.. ఈ ఆయిల్ ఉపయోగించితే మంచి ఫలితం కనిపిస్తుంది.
రోజ్‌హిప్ ఆయిల్
రోజ్‌హిప్ ఫ్రూట్‌లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. హీలింగ్ గుణాలు కూడా అధికం. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, సెల్ రీజనరేషన్‌లోనూ తోడ్పడుతుంది.
ఆర్గాన్ ఆయిల్
చర్మంపై ఉన్న ముడతలు తొలగించడంలో ఆర్గాన్ ఆయిల్‌ను ‘ది బెస్ట్’ అని చెప్పొచ్చు. స్ట్రెచ్ మార్క్స్‌ను ప్రివెంట్ చేయడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ఫ్యాటీ యాసిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ ఇందులో అధిక మొత్తంలో ఉంటాయి.