చేతిలో చేయివేసుకుని.. చెరువులోకి దూకి

by Sumithra |
చేతిలో చేయివేసుకుని.. చెరువులోకి దూకి
X

దిశ, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధం రెండు కుటుంబాలలో విషాదం నిప్పింది. ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. తమిళనాడులోని సేలం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మకుటంజావడి సమీపంలోని కూడలూరు గ్రామానికి చెందిన శేఖర్(26), నామక్కల్ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన గోపాల్ భార్య గోమతికి(30)మధ్య పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. శేఖర్ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. బంకులోనే గోమతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. వీరి వ్యవహారం కాస్త రెండు కుటుంబాల సభ్యులకు తెలిసింది. దీంతో వారి కుటుంబాల్లో గొడవలు అయ్యాయి. అయినప్పటికీ ఈ ఇద్దరి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా.. అలాగే వారి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. విసిగిపోయిన ఇరు కుటుంబాలు పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరినీ గట్టిగా మందలించారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్, గోమతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శేఖర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మరణంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed