బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు

దిశ, న్యూస్​బ్యూరో: మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు పొడిగించినట్టు విద్యాసంస్థల కార్యదర్వి మల్లయ్యభట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దఖాస్తులను ఆగస్టు 5వ తేదీ వరకూ పొడిగించినట్టు తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement