- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపుతో సానుకూలంగా ద్రవ్యోల్బణం!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ద్రవ్యోల్బణం గణనీయంగా సానుకూల స్థితిలో ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతానికి నియంత్రణలో ఉందని, అయితే ప్రధాన ద్రవ్యోల్బణం ఎక్కువగానే కొనసాగుతోందని బుధవారం జరిగిన బిజినెస్ స్టాండర్డ్ బీఎఫ్ఎస్ఐ కార్యక్రమంలో తెలిపారు. ఇందులో తృణధాన్యాలు, వంటనూనెలకు సంబంధించిన సరఫరా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది.
ఇప్పుడు పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి నిర్ణయం వల్ల ద్రవ్యోల్బణం మెరుగుదలను సూచిస్తుందని ఆయన వివరించారు. ఇదే సమావేశంలో క్రిప్టోకరెన్సీ గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయని దాస్ అభిప్రాయపడింది. ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా క్రిప్టోకరెన్సీ అంశం ఆందోళన కలిగించేదిగా ఉంటుందని, ప్రభుత్వానికి అవసరమైన సూచనలు అందించాం. ప్రభుత్వం వీటిని పరిశీలిస్తోందని, దీనికి సంబంధించిన సవాళ్లను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని దాస్ పేర్కొన్నారు.