అమెరికాలో కొడుకు.. వేడుక జరిపిన పోలీసులు

by Shyam |   ( Updated:2020-04-24 07:38:50.0  )
అమెరికాలో కొడుకు.. వేడుక జరిపిన పోలీసులు
X

ట్విట్టర్‌లో అభినందించిన మాజీ ఎంపీ కవిత

దిశ, న్యూస్ బ్యూరో :

కరోనా నేపథ్యంలో తన తల్లి 60వ పుట్టినరోజును నిర్వహించలేకపోతున్నానని, ఎలాగైనా ఆ వేడుకను నిర్వహించాలన్న అమెరికాలోని ఓ కొడుకు కోరికను రాచకొండ పోలీసులు నెరవేర్చారు. మల్కాజ్‌గిరి పరిధిలో ఉన్న తన తల్లి పుట్టిన రోజును నిర్వహించాలని అమెరికాలో ఉంటున్న ఆమె కొడుకు ఆల్ఫ్రెడ్ డీసీపీ రక్షిత కె. మూర్తిని కోరారు. స్పందించిన పోలీసులు తమ టీమ్‌తో ఆమె ఇంటి ముందు మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఆల్ర్ఫెడ్ వాట్సప్‌లో పంపిన పుట్టినరోజును పాటను పాడారు. కొడుకి ప్రేమకు, పోలీసుల నిర్వహణకు మురిసిపోయిన ఆ రిటైర్డు టీచర్ చేతులు జోడించి తన ఆనందాన్ని తెలియజేశారు. కాగా, పోలీసుల స్పందనపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో అభినందనలు తెలపడం విశేషం.

Tags: America, Birhtday, Malkajgiri, DCP, Twitter, Ex MP Kavita

Advertisement

Next Story

Most Viewed