- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీకి ఈటల.. టీ రాజకీయాల్లో ఉత్కంఠ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో చేరికపై ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వకుండా ఉన్నప్పటికీ… ప్రస్తుతం ఆయన ఢిల్లీ టూర్‌తో ఊహాగానాలకు బ్రేక్ పడినట్లు అవుతోంది. రాష్ట్ర బీజేపీ నేతలతో వరుస సమావేశాల తర్వాత ఆయన బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరేందుకు పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే వర్చువల్ మీటింగ్‌లో చర్చించినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ముగ్గురు ముఖ్యులతో భేటీ
ఆదివారం రాత్రి ఎంపీ వివేక్ గెస్ట్‌హౌజ్‌లో బస చేయనున్న ఈటల… సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్రమంత్రి అమిత్‌షా, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంతోష్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం ఈటల నేరుగా హుజురాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులతో బీజేపీలో చేరే అంశంపై చర్చించనున్నట్లు ప్లాన్ వేసుకున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ భార్య జమున ప్రభుత్వ విధానంపై విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవం కోసం ఆస్తులు అమ్ముకుంటామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
వద్దన్న నేతలు
ఇక రెండు రోజుల క్రితం శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరామ్ ఈటలతో భేటీ అయ్యారు. ఈటల బీజేపీలో చేరతారని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో సమావేశమై… బీజేపీలో చేరవద్దని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటు చేద్దామని సూచించారు. ఈటలకు నైతికంగా మద్దతు తెలిపేందుకే ఇక్కడకు వచ్చామని విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
జూన్‌లోనే చేరిక
అయితే బీజేపీలో చేరిన అనంతరమే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా బీజేపీలో చేరుతారని, ఆ తర్వాత రాజీనామా ప్రకటిస్తారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఈటల వర్గీయుల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఈటల పోటీ చేయరని, ఆయనకు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తుందని, అనంతరం కేంద్రమంత్రి పదవి ఇవ్వనుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్‌లో ఈటల సతీమణి జమున పోటీ చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది.