ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

by srinivas |   ( Updated:2020-07-20 23:26:24.0  )
ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ గుండెపోటుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో కురుపాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఈయన మేనల్లుడు అవుతాడు.

Advertisement

Next Story

Most Viewed