WTC ఫైనల్‌పై టీమిండియా మాజీ కీపర్ సంచలన వ్యాఖ్యలు

by Shyam |
Saba Karim
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కీపర్, బీసీసీఐ మాజీ క్రికెట్ డైరెక్టర్ సబా కరీం సంచలన వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్‌లో జట్టు కూర్పు సరిగా లేదని ఆయన అన్నారు. న్యూజీలాండ్ జట్టు అన్ని విభాగాల్లో అదరగొట్టగా భారత జట్టు మాత్రం సరైన సన్నద్ధత, జట్టు కూర్పులేక భారీ మూల్యం చెల్లించుకున్నదని సబా కరీం అన్నారు. జస్ప్రిత్ బుమ్రా గత కొన్ని రోజులుగా సరైన ఫామ్‌లో లేకున్నా కేవలం అతడి పేరు చూసి మాత్రమే జట్టులోకి తీసుకున్నారని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాలంలో భారత జట్టులోకి కేవలం పేర్లు చూసి ఆటగాళ్లను తీసుకుంటారన్న అనుమానం వస్తున్నదని ఆయన అన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 36.4 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 92 రన్స్ ఇచ్చాడు. అతడు మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపించకుండా ఉండటమే భారత జట్టు ఓటమికి కారణమని సబా కరీం అన్నాడు. మరోవైపు ఇషాంత్, షమి వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చినా బుమ్రా మాత్రం పేలవ ప్రదర్శనతో ఓటమికి కారణమయ్యాడని అన్నారు. న్యూజీలాండ్ జట్టులో ప్రతీ బౌలర్ వికెట్లు తీయడమే కాకుండా పరుగులు రాకుండా కట్టడి చేశారని కరీం గుర్తుచేశాడు.

Advertisement

Next Story

Most Viewed