- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి విద్యార్థి కచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి: పోలీస్
దిశ, కూకట్‌పల్లి: సైబర్‌నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ సీఐ వహీదుద్దిన్అన్నారు. బాలానగర్పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలానగర్ ఫిరోజ్‌గూడ లోని సదాశివ స్కూల్లో సైబర్‌నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వహీదుద్దిన్మాట్లాడుతూ.. సమాజంలో చాలామంది సైబర్ నేరాగాళ్లు చేతులలో మోసపోతున్నారని, తమకు తెలియకుండానే వారి కోరల్లో చిక్కుకుని తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరి చేతులలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లనే టార్గెట్‌గా చేసుకున్న సైబర్‌నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారన్నారు.
మనకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్కు స్పందించ రాదని, ఎస్‌ఎంస్‌లలో వచ్చే లింక్‌లను ఓపెన్చేయకూడదని చేప్పారు. ఆఫర్‌ల పేరుతో వెబ్లింక్లతో కూడిన మేసేజ్‌లు పంపి వాటి ద్వారా మన సెల్ ఫోన్‌ను హ్యాక్‌చేసి అకౌంట్‌లో నుంచి డబ్బులను కాజేస్తున్నారన్నారు. స్మార్ట్ఫోన్ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తమ క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు నంబర్‌లు, సివివి నంబర్‌లు, ఓటీపీలు ఎవరితో షేర్చేయకూడదని సుచించారు.