- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి రోగి వద్ద ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం: ఈటెల
ఏ పనిచేసినా ఫీడ్ బ్యాక్ అనేది చాలా ముఖ్యమనీ, ఫీడ్‌బ్యాక్‌తోనే యాజమాన్యాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవచ్చని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేంధర్ అన్నారు. అందుకే అన్ని ప్రభుత్వాసుప్రతుల్లోనూ రోగుల నుంచి ఆసుపత్రి పనితీరును అడిగి తెలుసుకుంటామని తెలిపారు. ఆస్పత్రుల పనీతీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘మై క్రిటిక్’ అనే యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరిగిన తరువాత ఫీడ్‌బ్యాక్ అవశ్యకత మరింత పెరిగిందని వెల్లడించారు. అనేక రంగాల్లో ఐటీ అప్లికేషన్స్ వాడుతున్నామనీ, వైద్య రంగంలోనూ వాటిని ఉపయోగించి పారదర్శకతను, కచ్ఛితత్వాన్ని పెంచి మరింత సంతృప్తికరమైన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఈ ఫీడ్ బ్యాక్ యాప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందనీ, ఇలాంటివి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయన్నారు. ఒక రోగి ఆసుపత్రికి వేళ్తే, రిసెప్షన్ దగ్గరనుంచి, డిశ్చార్జ్ అయ్యే వరకు అతనికి ఎదురైన అనుభవాలను ఈ యాప్‌లో పొందుపర్చవచ్చని తెలిపారు. డాక్టర్లు ఎన్నిసార్లు చూడడానికి వచ్చారు, ఎలాంటి చికిత్స అందించారు, ఆస్పత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది, అనే వివరాలు ఈ యాప్‌లో నమోదు చేస్తే ఈ సమాచారం నేరుగా ఆసుపత్రి నిర్వాహకులకు వెళ్తాయని వివరించారు. టాంపరింగ్‌కు అవకాశం లేకుండా రూపొందించిన ఈ యాప్ ద్వారా గణనీయమైన మార్పు తీసుకురాగలమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలెట్‌గా దీనిని ప్రవేశపెట్టి ఫలితాలు సమీక్షించుకున్న అనంతరం, అన్ని ఆసుపత్రులకు అనుసంధానం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈటెల అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, స్వెన్ టెక్నాలజీస్ ఎండీ గంగుల కృష్ణరెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శి నరేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్స్ సురేంధర్ రెడ్డి, శ్రీకర్‌రెడ్డి పాల్గొన్నారు.