ప్రపంచంలోనే తొలి వ్యాక్సినేటెడ్ ఎయిర్‌లైన్స్

by Sujitha Rachapalli |
ప్రపంచంలోనే తొలి వ్యాక్సినేటెడ్ ఎయిర్‌లైన్స్
X

దిశ, ఫీచర్స్: కొవిడ్ నేపథ్యంలో ప్యాసింజర్ల సేఫ్టీ నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎయిర్‌పోర్ట్స్.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రయాణికుల రాకపోకల సందర్భంగా టెస్టులు నిర్వహిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఎయిర్‌పోర్ట్స్‌లో శానిటైజేషన్ పట్ల అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ‘ఎత్తిహాద్ ఎయిర్‌లైన్స్‌’కు చెందిన స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. తద్వారా ప్రపంచంలోనే పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఎయిర్‌‌లై‌న్స్‌గా నిలిచింది.

యూఏఈ క్యాపిటల్ అబుదాబిలోని ఎత్తిహాద్ ఎయిర్‌వేస్(Etihad Airways)ను ప్రపంచంలోనే అత్యున్నత పరిశుభ్రతా ప్రమాణాలు కలిగిన, సేఫెస్ట్ ఎయిర్ లైన్స్‌ కంపెనీగా ‘ఎపెక్స్ హెల్త్ సేఫ్టీ ఆడిట్’ పేర్కొంది. ఇటీవల ఈ కంపెనీకి డైమండ్ స్టేటస్ ఇవ్వగా, ఇప్పుడు మరో రికార్డు సాధించింది. క్యాబిన్ క్రూ, ఆపరేటింగ్ పైలట్స్ ఇతర సిబ్బంది అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా ప్రయాణికులు, సిబ్బంది రక్షణ కోసం అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని ఎయిర్‌లైన్స్ ఆఫీసర్లు తెలిపారు. హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేటెడ్ ఎత్తిహాద్ స్టాఫ్‌.. ప్రస్తుతం హ్యాపీగా తమ విధులు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story