వెయ్యి కార్లతో ఈటల కాన్వాయ్..?

by Sridhar Babu |   ( Updated:2021-05-02 23:47:30.0  )
వెయ్యి కార్లతో ఈటల కాన్వాయ్..?
X

దిశ, హుజురాబాద్: రాష్ట్ర మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ భారీ స్కెచ్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా హుజురాబాద్‎కు బయల్దేరేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. వెయ్యి వాహనాల కాన్వాయ్‌తో ఈటల.. శామీర్‎పేట్ నుండి హుజురాబాద్‌కు చేరుకుని తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారని సమాచారం. మరి కొద్దిసేపట్లో జరగనున్న మీడియా సమావేశం తరువాత ఈటల తన భవిష్యత్ కార్యచరణను ఆచరణలో పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed