బ్లాక్ మర్కెట్‌ను నియంత్రించాలి : మంత్రి

by Aamani |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వైద్య పరికరాలు బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ బీఆర్‌కే భవన్ నుంచి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై ట్యాక్స్ ఎత్తివేయాలని రాజేందర్ కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలను కస్టమ్స్, ట్యాక్స్ రద్దు చేయాలని కూడా కోరారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఈసీఐఎల్, డీఆర్డీఓ లాంటి సంస్థల్లో తయారుచేసి రాష్ట్రాలకు అందజేయాలని రాష్ట్ర మంత్రి కోరారు. N-95 మాస్కులు, పీపీఈ కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగలేదని, ఇప్పటికీ 8,500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలిందని ఈటల వివరించారు. 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, 12 మంది మరణించినట్టు తెలిపారు. లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.

Tags: Minister Etela Rajender, central minister, video conference, health, corona

Advertisement

Next Story

Most Viewed