- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్వకుంట్ల కవితపై ఈటల హాట్ కామెంట్స్..
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కాలంలో కార్మిక సంఘాలను చైతన్యపరిచిన నాయకులకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించలేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ సంఘాలను తన ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పారు. అందుకే గతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని నేను, కొప్పుల ఈశ్వర్, వినోద్ కుమార్ కలిసి ఏర్పాటు చేశామని గుర్తుచేసిన ఈటల.. ఆ సంఘం అధ్యక్షురాలిగా సంబంధం లేని కవితను నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీలో కూడా సంఘాలు ఏర్పాటు చేసింది హరీశ్ రావు, నేను(ఈటల రాజేందర్) అని గుర్తు చేస్తూ.. ఇక్కడ కూడా కవితను (Kalvakuntla Kavitha ) నియమించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఆర్టీసీ కార్మిక సంఘంలో కీలకంగా ఉన్న అశ్వథ్థామరెడ్డిని చివరకు సంఘంలోనే లేకుండా చేశారని ఈటల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. విద్యుత్ కార్మికుల సంఘాన్ని పుట్టించింది కొప్పుల ఈశ్వర్ అయితే.. ఈ సంఘాన్ని కూడా కల్వకుంట్ల కవిత నడపాలని చూస్తోందన్నారు. తెలంగాణ గడ్డ మీద సంఘాలు ఉండొద్దని కోరిన కేసీఆర్, ఉన్నప్పటికీ తన ఆధీనంలోనే ఉండాలని కవితకు బాధ్యతలు అప్పగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.