- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి చేరికలు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
దిశ, మణుగూరు: తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు ధర్మం, న్యాయం గెలిపించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సోమవారం కొత్తగూడెం, భద్రాచలం పర్యటన ముగించుకుని మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారి మీదుగా వెళుతుండగా.. మణుగూరు మండలంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పున్నం భిక్షపతి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆయనను కలిశారు. జిల్లా, మండల నాయకులు పూలమాలవేసి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు ధర్మం, న్యాయం గెలిపించి
సంఘటితమవ్వాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పూటకొక మాట మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రగతి భవన్, ఫాంహౌస్ కే పరిమితమయ్యారన్నారు. ముఖ్యంగా రాష్టంలో 1,91,000 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిటీ ఫైడింగ్ లో తేలిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ మట్టికొడుతున్నారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల ఉసురు తీసుకుంటున్నారన్నారు. కొంతమంది నాయకులు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు టొబాకో బోర్డు మెంబర్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన్న సీతారామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పున్నం భిక్షపతి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముక్కు శ్రీనివాస్ రెడ్డి, మణుగూరు పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.