- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో వైసీపీ ఎంపీ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుప్రీం కోర్టు బెంచ్ పెట్టాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. సుప్రీంకోర్టు బెంచ్ పెడితే భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచేందుకు వైసీపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయొచ్చని ఎంపీ వేమిరెడ్డి సూచించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేవలం నలుగురు (9 శాతం), హైకోర్టుల్లో 81 (11 శాతం) మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఐదు హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తులే లేరన్న విషయాన్ని రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 6 శాతం, హైకోర్టుల్లో 3 శాతం మాత్రమే ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తులు ఉన్నారని రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుల్లో సామాజిక ఏకత్వం కావాలంటే, ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల ప్రాతినిధ్యం కావాలని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 312 ప్రకారం ఆలిండియా జ్యుడీషిల్ సర్వీస్ అవసరం ఉందని.. పార్లమెంట్ దీనిపై చట్టం చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- Tags
- establish