- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో నిత్యవసర వస్తువుల ధరలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం 11 గంటల వరకే నిత్యావసర వస్తువుల షాపులు తెరచి ఉంచుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని నిత్యావసర వస్తువుల ధరలను వ్యాపారులు పెంచి విక్రయిస్తున్నారు. వీటిని క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు నిర్ణయించింది. ఆ ధరల వివరాల్లోకి వెళ్తే…
సరకు పేరు | బరువు | ధర (రూపాయల్లో) |
సోనామసూరి బియ్యం | కేజీ | 47 |
బీపీటీ బియ్యం | కేజీ | 40 |
లోకల్ కందిపప్పు | కేజీ | 90 |
అకోల కందిపప్పు | కేజీ | 100 |
పెసరపప్పు | కేజీ | 115 |
శెనగపప్పు | కేజీ | 65 |
గోధుమ పిండి | కేజీ | 35 |
గోధుమ రవ్వ | కేజీ | 45 |
పంచదార | కేజీ | 42 |
పామాయిల్ | కేజీ | 89 |
పామాయిల్ ప్యాకేట్ | కేజీ | 88 |
సన్ ఫ్లవర్ ఆయిల్ | కేజీ | 100 |
సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ | కేజీ | 95 |
వేరు శనగ నూనె | కేజీ | 138 |
వేరుశనగ నూనె ప్యాకెట్ | కేజీ | 129 |
ఇక కూరగాయల ధరల్లోకి వెళ్తే…
టమాటో | కేజీ | 14 |
వంకాయలు | కేజీ | 18 |
బెండకాయలు | కేజీ | 20 |
పచ్చిమిర్చి | కేజీ | 34 |
కాకరకాయలు | కేజీ | 20 |
బీరకాయలు | కేజీ | 34 |
కేబేజీ | కేజీ | 12 |
క్యారెట్ | కేజీ | 35 |
దొండకాయలు | కేజీ | 20 |
బంగాళాదుంపలు | కేజీ | 28 |
ఉల్లిపాయలు | కేజీ | 30 |
ఆనపకాయ (సొరకాయ) | కేజీ | 10 |
అరటికాయలు | కేజీ | 5 or 4 |
మునక్కాయలు | కేజీ | 5 or 4 |
దోసకాయలు | కేజీ | 16 |
బీట్‌రూట్ | కేజీ | 20 |
ధరలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి షాపులో ధరలను పట్టికను విధిగా ప్రదర్శించాలని ఆదేశించింది. సంచార బజార్లు అంటే ఈ మధ్య విజయవాడ మున్సిపాలిటీ ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన సిటీ బస్సుల బజార్లు వంటి వాటిల్లో నిర్ధేశించిన ధరల కంటే 10 శాతం అధికంగా విక్రయించవచ్చని సూచించింది.
ఈ ధరలను మించి విక్రయిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4402 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా పౌరసరఫరాల శాఖ అధికారులు, లేదా విజిలెన్స్ లేదా రెవెన్యూ విభాగాలకి ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.