- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్వారంటైన్ నుంచి తప్పించుకుని గ్రామంలోకి..
దిశ, మహబూబ్ నగర్: క్వారంటైన్ నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చేందుకు యత్నించిన వ్యక్తిని స్వచ్ఛందంగా విధులు నిర్వర్తిస్తున్న వాలంటీర్లు అడ్డుకున్నారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. డిసెంబర్‌లో దుబాయ్ వెళ్లొచ్చిన శంషోద్దిన్ అనే వ్యక్తిని అధికారులు మూడు రోజుల క్రితం నారాయణపేట సమీపంలోని సంగారం క్వారంటైన్‌కు తరలించారు. అయితే, క్వారంటైన్ గడువు పూర్తికాకముందే అక్కడి నుంచి తప్పించుకుని శుక్రవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ శివారులో గస్తీ కాస్తున్న వాలంటీర్ యువకులు.. అతన్ని గుర్తించి నిలదీయడంతో శంశోద్దిన్ తన బంధువులకు ఫోన్ చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న బంధువులు.. వాలంటీర్లతో వాగ్వివాదానికి దిగారు. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, ఆరోగ్య సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని శంషోద్దిన్‌ను తిరిగి క్వారంటైన్‌కు పట్టుకెళ్లారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కుడా ఇలాంటి వారిని గుర్తిస్తే వెంటనే సమాచారమివ్వాలని తెలిపారు.
Tags: quarantine,person,escaped,utkur, coronavirus, police, volunteers, lockdown,