అప్పుడే మూడెకరాల భూమిపై కొత్త ప్రణాళిక: ఎర్రబెల్లి

by Shyam |
అప్పుడే మూడెకరాల భూమిపై కొత్త ప్రణాళిక: ఎర్రబెల్లి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం అవార్డుల మీద అవార్డులు ఇస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాలు బాగున్నాయంటూ అవార్డులను ఇస్తున్నారంటూ చెప్పారు. ఏ తండాల్లోనూ డెంగీ, విషజ్వరాలు లేవన్నారు. కొందామన్నా గ్రామాల్లో భూములు దొరికే పరిస్థితి లేదని చెప్పారు. మూడెకరాల భూమి పథకంపై మార్చి నెల తర్వాత కొత్త ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. ఎస్సీ,ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకాన్ని తీసుకు రాబోతున్నామని తెలిపారు. దేశంలోనే వంద శాతం నల్లా నీళ్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story