ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

by srinivas |
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను అందించాలని నిర్ణయించింది. ఈ డిక్షనరీల కొనుగోలుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో–36 విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులు కూడా రాణించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ఇప్పటికే విద్యార్థులకు మూడు జతల యూనిఫారం, పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, ఒక జత షూలు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగును అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వీటికి తోడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిక్షనరీలను కూడా అందించాలని నిర్ణయించింది. తొలుత 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌–తెలుగు డిక్షనరీలను అందించాలని ఇందుకోసం నియమించిన కమిటీ గుర్తించింది. దీంతో 6–10వ తరగతి విద్యార్థుల కోసం 23,59,504 ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Advertisement

Next Story

Most Viewed