తొలి టెస్టుకు విండీస్, ఇంగ్లండ్ జట్లు ప్రకటన

by Shyam |
తొలి టెస్టుకు విండీస్, ఇంగ్లండ్ జట్లు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా క్రికెట్ స్తంభించింది. కరోనా తర్వాత పూర్తి బయో సెక్యూర్ వాతావరణలో ఇంగ్లండ్‌లో తొలి టెస్టు జరుగనున్నది. జూలై 8న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోనుంది. ఇందుకోసం ఇరు జట్లలో ఆడబోయే ఆటగాళ్లను ప్రకటించాయి. విండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారమే జట్టును ప్రకటించగా, శనివారం ఇంగ్లండ్ నేషనల్ క్రికెట్ సెలెక్టర్లు జట్టు సభ్యులను ప్రకటించారు. మొత్తం 22 మంది ఆటగాళ్లతో జాబితాను ప్రకటించగా, అందులో 9మంది రిజర్వ్ ఆటగాళ్లు ఉన్నారు. జో డెన్లీ, డోమ్ బెస్‌లకు కొత్తగా అవకాశం ఇవ్వడంతో డాన్ లారెన్స్‌కు నిరాశ ఎదురైంది. ఆల్ రౌండర్ సామ్ కరణ్ కరోనా పరీక్షలో నెగెటివ్‌గా నిర్ధారణ అయినా అతడిని జట్టులోకి తీసుకోలేదు. కెప్టెన్ జో రూట్ తన భార్య ప్రసవం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. మూడు టెస్టులను రెండు వేదికల్లో నిర్వహించనున్నట్లు ఈసీబీ ఇప్పటికే ప్రకటించింది. స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. అక్కడికి ఇతరులు రాకుండా నిబంధనలు జారీ చేశారు. క్రికెటర్లు సైతం బయటకు వెళ్లకుండా నిఘా ఉంటుంది. ఇప్పటికే పర్యాటక వెస్టిండీస్‌ జట్టు, మ్యాచ్‌ అధికారులు, బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సిబ్బంది సైతం ఈసీబీ నిబంధనలు పాటించి మూడు వారాలుగా క్వారంటైన్‌లో ఉన్నారు.

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు

బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, డోమ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలే, జో డెన్లీ, అలీ పోప్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

విండీస్‌ టెస్టు జట్టు

జేసన్‌ హోల్డర్ ‌(కెప్టెన్‌), బ్లాక్‌వుడ్‌, బానర్‌, బ్రాత్ ‌వైట్‌, బ్రూక్స్‌, క్యాంప్‌బెల్‌, రోస్టన్‌ చేజ్‌, కార్న్‌ వాల్‌, డౌరిచ్‌, గాబ్రియేల్‌, చెమర్‌ హోల్డర్‌, షై హోప్‌, అల్జారీ జోసెఫ్‌, రేమన్‌ రీఫర్‌, కీమర్‌ రోచ్‌

Advertisement

Next Story

Most Viewed