- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్
by Sumithra |
X
దిశ, భద్రాచలం : భద్రాచలం సరిహద్దు చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. గంగళూరు ప్రాంతంలో భద్రతా బలగాలు శిబిరం ఏర్పాటు చేస్తుండగా ప్రజలపై ఒత్తిడి తెచ్చిన మావోయిస్టులు నిరసనలు తెలుపాలని హెచ్చరించారు. ఇక మావోయిస్టుల కదలికలను గమనించిన డీఆర్‌జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో హిరామకొండ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడ్డ మావోలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇక భద్రతా బలగాలను ఎదుర్కొలేక మావోలు అడవుల్లోకి జారుకున్నారు. అనంతరం అధికారులు మావోయిస్టులు వదలివెళ్లిన ఆయుధాలు, విల్లంబులు, రోజువారి వినియోగసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Advertisement
Next Story