- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశించి, ఊరించి.. చివరకు భంగపడ్డ సీనియర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : పీసీసీ పీఠం మాదంటే మాదంటూ పోటీపడ్డ నేతలకు పార్టీ పదవులు దక్కలేదు. టీపీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పలు పదవులను ప్రకటించిన ఏఐసీసీ… రాష్ట్రంలోని సీనియర్ నేతలను పక్కన పెట్టింది. వర్గ విభేదాలను ప్రోత్సహించిన నేతలకు అవకాశం ఇవ్వలేదు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు చాలా ప్రయత్నాలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు మధుయాష్కి, వీ. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వంటి నేతలు పీఠం కోసం పోటీ పడ్డారు. ఒక దశలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగారు. ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారు. పలుమార్లు ఏఐసీసీ దూత మాణిక్కం ఠాగూర్ ఎదుటే విమర్శలు చేసుకున్నారు.
ఇద్దరికే ఛాన్స్..
టీపీసీసీ కుర్చీ కోసం పోటీ పడిన నేతలకు పార్టీ పదవులు దూరమయ్యాయి. రేసులో ముందున్నట్లుగా ప్రచారం జరిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఎలాంటి పదవులు దక్కలేదు. టీపీసీసీ తనకే కావాలంటూ చెప్పుకొచ్చిన జగ్గారెడ్డి కొన్ని రోజుల నుంచి మాట మార్చారు. తనకు వర్కింగ్‌ప్రెసిడెంట్ ఇచ్చినా చాలన్నట్లుగా మాట్లాడారు. అనుకున్నట్టే ఆయనకు వర్కింగ్ప్రెసిడెంట్పదవి దక్కింది. మాజీ ఎంపీ మధుయాష్కి కూడా పోటీ పడినా.. ఆయన్ను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న వారికి కూడా ఈసారి ఎలాంటి పదవులివ్వలేదు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ప్రెసిడెంట్లలో రేవంత్‌రెడ్డి మార్క్కనిపిస్తోంది. మొదట్నుంచీ మద్దతుగా ఉంటున్న అంజన్‌కుమార్‌యాదవ్‌కు వర్కింగ్ప్రెసిడెంట్లు అవకాశం దక్కింది. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్లుగా మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి వంటి నేతలకు సైతం ఛాన్స్కల్పించారు.
సీనియర్లతో భేటీ అయిన రేవంత్..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి పలువురు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్‌నేత జానారెడ్డి, షబ్బీర్‌అలీతో సమావేశమైన రేవంత్… పలు అంశాలపై చర్చించారు.