- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ ఉద్యోగుల ఘరానా మోసం
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ: ఆర్టీసీ ఉద్యోగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ బాధితులను మోసం చేశారు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, నకిలీ ఐడీ కార్డులు సైతం చూపించి బాధితులకు నిండా ముంచారు. వివరాల్లోకెళితే.. విద్యాధరపురం ఆర్టీసీ డిపోకు చెందిన రవికుమార్, వీరంకి బ్రహ్మారావులు, కొందరు వ్యక్తులకు ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. అలా మొత్తం రూ.15 లక్షల 50వేలు వసూలు చేశారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితులు మోసానికి పాల్పడ్డారు. అయితే మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.