- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IT ఆఫీసులకు వచ్చే ఉద్యోగులు 12శాతమే..!
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం ప్రధాన ఐటీ పార్కుల్లో ఉద్యోగులు కేవలం ఏడు నుంచి పన్నెండు శాతం మాత్రమే భౌతికంగా కార్యాలయాలకు హాజరవుతున్నారని, ఈ సంఖ్యను కనీసం 25 శాతానికి పెంచాలని తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు సత్యనారాయణ మాథాలా కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు శివార్లలోని 1500కు పైగా ఐటీ కార్యాలయాలు సజావుగా పని చేసే విధంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో దాదాపు 6.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీఎఫ్‌ఎంసీ ప్రతినిధి బృందం ఇటీవల ప్రభుత్వ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్‌రావును కలిసినట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగులను తిరిగి తమ కార్యాలయాలకు స్వాగతించడంలో వారి సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి రావడానికి ఇష్టపడటం లేదని తెలిపారు.
వారికి విశ్వాసం కలిగించేందుకు థర్డ్‌పార్టీ సిబ్బందితో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ నిపుణులను పరిగణనలోకి తీసుకోవాలని, టీకాలిచ్చే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి పని చేయడం వారి ఉత్పాదకతను ప్రభావితం చేయకపోయినా, సుదీర్ఘకాలం పాటు పని చేయడం వల్ల వారి సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని వివరించారు.