- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రెడిట్ కార్డుల ఈఎంఐపై సందేహాలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర లక్షన్నర కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత శుక్రవారం ఉదయమే ఆర్‌బీఐ కీలకమైన పలు నిర్ణయాలను ప్రకటించింది. లాక్‌డౌన్ వల్ల కలిగే నష్టాలను అధిగమించేందుకు వడ్డీ రేట్లలో కోత విధించింది. దీంతో రుణాలకు భారీ ఊరట లభించింది. అలాగే, అన్నిరకాల రుణాలపై మారటోరియం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా గృహ, వ్యక్తిగత, ఇతర రుణాలు తీసుకున్న కస్టమర్లు మూడు నెలల వరకు ఈఎంఐ చెల్లించేందుకు మినహాయింపు దొరికింది. అలాగే, చెల్లించలేని అకౌంట్లను ఎన్‌పీఏలుగా చూడకూడదని సదరు బ్యాంకులను, ఫినాన్స్ కంపెనీలను ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే, మాములుగా ఏ ఖాతాదారుడైనా చెల్లింపులను 90 రోజుల కంటే ఎక్కువ గడువు తీసుకుంటే ఎన్‌పీఏలుగా పరిగణిస్తారు. ఈ ప్రకటనతో చాలామంది ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్టు అయింది.
ఈ నిర్ణయంలో కొంతమంది సరికొత్త సందేహం మొదలైంది. క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందా లేదా? అని. ఈ అంశంపై స్పందించిన ఆర్‌బీఐ క్రెడిట్ కార్డుల వంటి వాటిపై ఈ మారటోరియం వర్తించదని, నిబంధనల ప్రకారం సదరు చెల్లింపులు వినియోగదారులు చెల్లించాల్సిందే అని వివరించింది. దీంతో క్రెడిట్ కార్డులున్న వినియోగదారు డీలాపడిపోయారు.
సాధారణంగా జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలు ఈ మారటోరియం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయవచ్చా? లేదా అనే నిర్ణయాన్ని బ్యాంకులే తీసుకుంటాయి. బ్యాంకులు ఆమోదం ఇస్తేనే ఈ ప్రయోజనాలు కస్టమర్లకు అందుతాయి. ఇక, క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఈ సందేహాలతో ఇబ్బందులు పడుతున్నారు. మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే పూర్తీ వివరాలు తెలుస్తాయి. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై బ్యాంకులు చర్చల అనంతర ఖరారు చేస్తాయి. బోర్డు స్థాయి మీటింగ్ అనంతరం ఆమోదిస్తేనే కస్టమర్లకు ఊరట అందినట్టు. అయితే, పరిస్థితులు సాధారణంగా లేవు కాబట్టి బ్యాంకులన్నీ ఆర్‌బీఐ నిర్ణయాన్ని పాటించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిపుణుల వివరాల ప్రకారం క్రెడిట్ కార్డుల చెల్లింపులు మారటోరియం పరిధిలోకి రావు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. అలాగే, ఆర్‌బీఐ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు, పలువురు విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు.