ఇక నుంచి ఎమర్జెన్సీ డయల్ 100 కాదు..

by Shamantha N |   ( Updated:2021-08-05 23:18:51.0  )
ఇక నుంచి ఎమర్జెన్సీ డయల్ 100 కాదు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ క్షణంలో ఏం జరుగుతుదో ఎవరికీ తెలియదు. అందువలన ప్రజలు అత్యవసర సమయంలో 100కి డయల్ చేస్తారు. ఎంత చదువు లేని వారైనా సరే ఈ అత్యవసర నెంబర్‌ను గుర్తు పెట్టుకుంటారు. కానీ, ప్రస్తుతం బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై దేశవ్యాప్తంగా ఒకే నంబరు అందుబాటులోకి రానుంది. దేశంలో ఒక అత్యవసర నెంబర్ మాత్రమే ఉండాలని రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో ‘డయల్ 112’ను ప్రవేశపెట్టనుంది.

ఇక ఈ నంబరుపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ ఈ ఏడాది మొదట్లోనే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో 112 నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఇక 112 నెంబర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మరో రెండు నెలల తర్వాత డయల్ 112 అందుబాటులోకి వస్తుంది. అయితే అప్పటి వరకు డయల్ 100 కూడా పనిచేస్తుంది. దానికి వచ్చే ఫోన్ కాల్స్ 112కు అనుసంధానమవుతాయి. ఇక ఈ నెల చివరివరకు 112కు సంబందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ అధికారులు, కాంట్రోల్ రూం పనిచేసేవారికి నేర్పాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు అర్ధమయ్యే విధంగా ప్రచారం చేయనున్నారు. అయితే ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా దేశవ్యాప్తంగా ఈ నంబరును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తుంది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed