- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బాలు నాయక్

దిశ,చింతపల్లి : పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించి, లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు పదేండ్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసుకొని ఎవరికి ఎలాంటి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టి పోతే..పదేండ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెడ్తూ రాష్ట్రాని ప్రగతి పథంలో నడిపిస్తూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజల జీవితాల్లో మార్పు రావాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలతో 2025 - 26 బడ్జెట్ రూపొందించి ప్రజా పాలన సాగిస్తున్నాం అని అన్నారు.
అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు. రేషన్ కార్డుల ద్వారా వారికి నిత్యావసర వస్తువుల సరఫరా చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మా ప్రభుత్వం సంక్షేమ పరిపాలనకు నిదర్శనం. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు, ప్రతి అమ్మాయి జీవితాన్ని వెలుగులు నింపేలా చేయడం మా లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి,మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్,మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీలు మాస మంజుల భాస్కర్, పీఎసీఎస్ చైర్మన్ వెంకటయ్య, మాజీ సర్పంచులు ముచ్చర్ల యాదగిరి, గోవర్ధన్, నర్సిరెడ్డి, జితేందర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి గుండె మోని కొండల్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు కాసరం శ్రీను, నర్సింహా, చందూ నాయక్,సలీం, పిఎసిఎస్ డైరెక్టర్ మల్లేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు గోవింద్ రవి,దాసరి రాజు, మార్కెట్ డైరెక్టర్ హన్మ నాయక్, ముషాఫర్,సుధాకర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్, రియాజ్ పాషా, తహసీల్దార్ రమాకాంత్ శర్మ, ఎంపిడిఓ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శంశోద్ధిన్,మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.