- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాధికారిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం: దాసు సురేశ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగ హక్కులు, అవకాశాలను సజీవ పరచడానికి ‘జన అధికార సమితి’ ఆవిర్భవించిందని దాసు సురేశ్ వ్యాఖ్యానించారు. ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకునే సాధికారిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి మార్గదర్శకత్వంలో జన అధికార సమితి సామాజిక సంస్థను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆవిర్భావ కార్యక్రమంలో అధికార ప్రతినిధి దాసు సురేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొందని, ఏడేళ్లలో 6,380మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 360మంది చేనేత కార్మికులు, 32మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, సమ్మెకాలంలో 40మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం పునాదిగా, సామాజిక న్యాయమే స్ఫూర్తిగా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలే ప్రతినిధులుగా “జన అధికార సమితి” పని చేస్తుందన్నారు. ముఖ్య నాయకులు టి.జయంత్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంటికో ఉద్యోగ నినాదం కేవలం ఒక ఇంటికే పరిమితమైందన్నారు.