- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమిలోంచి పైకిలేచిన పైపులైన్లు.. వ్యవసాయమే కారణమా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్లు భూమి పైకి తేలాయి. ఆరు మీటర్ల లోతున ఉన్న పైపులు సుమారు 250 మీటర్ల దూరం వరకు బయటకు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి పాలకుర్తి పంప్ హౌజ్, మేడారం పంప్ హౌజ్ ల మీదుగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణ పూర్ రిజర్వాయర్ కు అక్కడి నుండి వేములవాడ సమీపంలోని ఫాజుల్ నగర్ జలాశయానికి నీటిని తరలించేందుకు దాదాపు 12 ఏళ్ల క్రితం ఈ పైపులను ఏర్పాటు చేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ పైపుల ద్వారా నీటిని తరలిస్తున్నారు. అయితే ధర్మారం సమీపంలోని కటికెనపల్లి సమీపంలో భూమి లోపల నుండి పైపులు వెలికి రావడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సందర్శించనున్న ఇంజనీర్లు..
ధర్మారం మండలం కటికెనపల్లి సమీపంలో పైకి తేలిన పైపులను పరిశీలించేందుకు ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు రానున్నారు. నిపుణల అంచనా ప్రకారం పైపులు వేసిన ప్రాంతంలో రైతులు సాగు చేసుకోవడమే కారణమని తేలింది. పైపులైన్ల కోసం భూ సేకరణ జరిపినప్పటికీ రైతులు మాత్రం వ్యవసాయం చేయడంతో పంటల కోసం వాడే నీరు భూమి లోపలకు వెళ్లాయని భావిస్తున్నారు. సాగు కోసం వాడుకున్న నీటి కారణంగా పైపు లైన్ల పరిసరాల్లో భూమి అంతా లూజ్ సాయిల్ గా మారిపోవడం వల్లే పైపులు పైకి లేచి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసేందుకు నిపుణులు కటికెనపల్లికి రానున్నట్టు సమాచారం. పైకి తేలడం వల్ల పెద్దగా ప్రమాదం లేనప్పటికీ మొదట నీటిని ఈ పైపుల ద్వారా నీటిని టెస్ట్ పంపింగ్ చేసి పరిశీలిస్తారు. అనంతరం మట్టిని పైప్ లైన్ చుట్టూ వేసేందుకు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
భూమి స్వాధీనం..
అయితే ఎల్లంపల్లి పైప్ లైన్ కోసం 2007 – 2008 ప్రాంతంలోనే ఇరిగేషన్ అధికారులు భూ సేకరణ జరిపారు. నిబంధనల ప్రకారం ఈ భూమిపై సాగు చేయడానికి వీలు లేదు. అయితే కొంతమంది రైతులు పంటలు వేసుకుంటుండడంతో భూమిలోపల లూజ్ సాయిల్ ఏర్పడుతుందని అధికారులు గుర్తించారు. దీంతో పైప్ లైన్ల కోసం సేకరించిన భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ వ్యవసాయం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.