- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో ‘మేఘా’ టాప్.. వివిధ పార్టీలకు రూ.2,318 కోట్ల విరాళాలు
దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలయ్యాయి. ఎస్‌బీఐ కోర్టుకు హ్యాండోవర్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టాను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం బహిర్గతం చేసింది. ఈ మేరకు 763 పేజీల్లోని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ eci.gov.inలో పెట్టింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా తాము ఉన్నామని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు 2019 ఏప్రిల్ నుంచి 2024 జనవరి మధ్యకాలంలో రూ.12,155 కోట్ల విరాళాలు అందాయి. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది.
అత్యధికంగా మేఘా సంస్థ..
ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలిచ్చిన టాప్ కంపెనీల్లో తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ నిలిచింది. వివిధ రాజకీయ పార్టీలకు ఆ సంస్థ రూ.2,318 కోట్లను విరాళాలుగా ఇచ్చింది. ఇక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధికంగా బీజేపీకి రూ.11,562 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీ తరువాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.3,214 కోట్ల విరాళాలు అందాయి. ఇక బీఆర్‌ఎస్‌కు రూ.2,278 కోట్ల విరాళాలొచ్చాయి. వైసీపీకి రూ.662 కోట్లు, టీడీపీకి రూ.437 కోట్ల విరాళాలు అందాయి. మొత్తంగా టాప్ లిస్ట్‌లో తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిలిచింది.
ఈ క్రమంలోనే మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్న మేఘా కృష్ణారెడ్డి తక్కువ కాలంలోనే దేశంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్‌గా ఎలా ఎదిగారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతన్నాయి. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన రూ.48 వేల కోట్లు అప్పనంగా తినేశాడంటూ అప్పట్లో విపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. అదేవిధంగా ఇటలీలో రూ.వేల కోట్లతో దందా నడుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా ఐటీ అధికారులు తేరుకుని మేఘా కృష్ణారెడ్డిపై ఫోకస్ పెడతారా.. లేక చూసీచూడక వదిలేస్తారో వేచి చూడాల్సిందే మరి.
Read More..
టీడీపీ జాబితాలో ఈ సారి క్లాస్ - మాస్.. జోష్‌లో టీడీపీ శ్రేణులు