- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులు రాక
దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా రాఘవశర్మను నియమించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాకు రాఘవ శర్మ వచ్చినట్లు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల జారీ చేశారు.
పోలింగ్ ముగిసే వరకు సిద్దిపేట విద్యుత్ గెస్ట్హౌస్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు రాఘవ శర్మ అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ముందస్తు అపాయింట్మెంట్తో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు దుబ్బాక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాఘవ శర్మను కలవవచ్చని సూచించారు. నేరుగా వచ్చి కలవలేని వారు రాఘవ శర్మను 9816818005 నెంబర్ లో సంప్రదించవచ్చునని తెలిపారు. దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లు, ఫిర్యాదులుంటే సాధారణ పరిశీలకులకు తెలియజేయాలని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.