- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రచారం స్పీడ్ అప్.. మిగిలింది పదిరోజులే..
పట్టభద్రుల ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. పోలింగ్‌కు మరో పదిరోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు స్పీడ్పెంచారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిచాయి. తమ అభ్యర్థుల గెలు బాధ్యతలను పార్టీ ముఖ్య నేతల భుజస్కాంధాలపై మోపాయి. అభ్యర్థులు సైతం స్థానిక సమస్యలపై హామీలనిస్తూ పట్టభద్రుల ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,17,883 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతంతో పోల్చితే పాలమూరు జిల్లా ఓటర్లే అధికం. దీంతో అభ్యర్థులు ప్రాధానంగా పాలమూరు ఓటర్లపై దృష్టిసారించారు. బరిలో 93మంది అభ్యర్థులు ఉండడంతో బ్యాలెట్ పేపర్దినపత్రిక సైజులో ముద్రించే అవకాశం ఉంది.
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్పప్పటికీ చతుర్ముఖ పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచందర్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డి , మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య పోటీ నువ్వా ? నేనా అన్నట్లుగా ఉంది. ఎన్నికలు ఈ నెల 14వ తేదీ జరుగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ కు కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉండడం, మూడు జిల్లాల్లో ప్రచారం చేపట్టాల్సి రావడంతో అభ్యర్థులు వేగం పెంచారు. మూడు జిల్లాల్లో తమ ముఖ్య అనుచరులను ఎంపిక చేసి వారికి పట్టభద్రుల ఓటర్లను కలిసి మాట్లాడేందుకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
సాధారణ పోలింగ్ తో తేడా ..
సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పోలింగ్ లో చాలా తేడా ఉంటుంది. ఈ ఎన్నికల్లో తమ ప్రాధాన్యతను సూచిస్తూ ఒకటి, రెండు, మూడు ఇలా ఓట్లు వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ధేశిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటరు తాము అనుకున్న వారికి వేసే క్రమంలో కొంత గందరగోళం కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో తమకు రావాల్సిన ఓటు ఇతరులకు పోతుందనే భయం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో వారు పట్టభద్రుల ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు వేసేసమయంలో ప్రాధాన్యతా క్రమాన్ని వివరిస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు .
గెలిస్తే ఏం చేస్తాం..
తమను ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలికి పంపిస్తే ఏం చేస్తామనేది ఓటర్లకు వివరిస్తూ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మూడు జిల్లాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకుని వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ప్రచారంలో హామీ ఇస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,17,883 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1,16,704 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఓటింగ్ శాతంతో పోల్చితే పాలమూరు జిల్లా ఓటర్లే
అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడి ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానున్న నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రధానంగా తమ దృష్టిని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైపు సారిస్తున్నారు.
దినపత్రిక సైజులో బ్యాలెట్ పేపర్..
మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్ట భద్రుల నియోజకవర్గం ఎన్నికల బరిలో మొత్తం 93 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికలు కూడా ఈవీఎం మిషన్ల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్కో పోలింగ్ స్టేషన్ లో మూడు నుంచి నాలుగు బ్యాలెట్ బాక్సులు అవసరం అవుతోంది. మరోవైపు బ్యాలెట్ పేపర్ సైజు కూడా పెరుగనుంది. కనీసం దినపత్రిక సైజులో బ్యాలెట్ పేపర్ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటు వేసే ప్రక్రియ లేకపోవడం, బ్యాలెట్ పేపర్ కూడా పెద్ద సైజులో ఉండడం విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు సైతం ఓటింగ్ సమయంలో కొంత అయోమయానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.